ఈత వనం దగ్ధం చేసిన వ్యక్తి పై ఫిర్యాదు 

ఈత వనం దగ్ధం చేసిన వ్యక్తి పై ఫిర్యాదు 

ముద్ర,రాయికల్ :- రాయికల్ మండలం మైతాపూర్ గ్రామ శివారులో ప్రస్తుతం గీస్తున్న ఈత వనాన్ని రాయికల్ పట్టణం కు చెందిన ఓ వ్యక్తి కావాలనే  నిప్పంటించి దగ్ధం కావటానికి  కారకుడు అయ్యాడని, మైతాపూర్ గ్రామ గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు జగిత్యాల ఎక్సయిజ్ సి ఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు బత్తి మహేష్ మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన వ్యక్తి భూమిలో ఉన్న ఈతవనాన్ని గీస్తూ జీవనోపాధి పొందుతున్నామని గత మూడు రోజుల క్రితం రాయికల్ కు చెందిన బైరి రాజశేఖర్ అకారణంగా ఈతవనాన్ని దగ్ధం చేయడంతో పాటు నిచ్చెనలు, ఈత కుండలను కూడా ధ్వంసం చేశాడని చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటూతమకు న్యాయం చేయాలని కోరడం జరిగిందని తెలిపారు.