ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్

ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్
  • మండలానికో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం
  • మీ కష్టసుఖాలలో తోడుంటా 
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

ముద్ర, జమ్మికుంట:- వీనవంక మండలం నర్సింగపూర్ , వల్ బాపూర్, కనపర్తి, బేతిగల్ గ్రామలలో  ప్రచారాన్ని ప్రారంభించిన ప్రణవ్ కు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఊరంతా ప్రచార రథం పై తిరుగుతూ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ నర్సింగాపూర్ శివాలయం వద్దకు చేరుకోగానే వందలాదిగా జనాలు కార్యకర్తలు గుమీగుడారు ప్రచార రథం పై  నర్సింగాపూర్ శివాలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అభివాదం చేశారు. సందర్భంగా మాట్లాడుతూ నేను మీలో ఒక్కడినేనని మీ ఇంట్లో కొడుకు లాగా ఆదరించాలని మీతో పాటు మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని  అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించింది ప్రజలకు చేసింది ఏందని ప్రశ్నించారు. మేనిఫెస్టో రూపొందించిన తర్వాత మేము నిర్ణయించిన 500 గ్యాస్ సిలిండర్ ధరను 400 కి ఇస్తాను అనడం విడ్డూరంగా ఉందన్నారు. గత పదెల్లుగా అధికారంలో ఉన్నప్పుడు  గుర్తుకు రాని సిలిండర్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ప్రశ్నించారు.  తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి మనం బహుమానంగా ఇచ్చేది కాంగ్రెస్ గెలుపేరని ఆయన అన్నారు.

మాటిచ్చి నెరవేర్చే తత్వం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని మీ ఇంటికి చర్చ బాధ్యత తీసుకుంటానని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇంటికి అందిస్తామని. మహిళలకు బస్సు ప్రయాణం మొత్తం ఫ్రీగా ఉంటుందని,  పెన్షన్ 4000గా చేస్తున్నామని, అర్హులైన అందరికీ భూమితో పాటు రూపాయలు ఐదు లక్షలు ఖర్చుతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. యువతీ యువకులకు చదువుకోవడానికి 5 లక్షల రూపాయల యువ వికాసం పథకాన్ని రూపొందించమని ఆయన పేర్కొన్నారు.  హుజురాబాద్ నియోజకవర్గం గడ్డమీద ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ఆయన అన్నారు. యువకుల ఉన్నత చదువుల కోసం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఏ ఒక్క మండలంలో స్టడీ సెంటర్ లేదని, మండలాలకు స్టడీ సెంటర్, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఏడుసార్లు హుజురాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందిన వ్యక్తి ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. మళ్లీ మూడేళ్ల క్రితం వచ్చి నన్ను చంపుకుంటారో.. సాదుకుంటారో... అంటే మళ్ళీ అవకాశం ఇచ్చినప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక్క రూపాయి నిధులను సైతం తీసుకురాలేదని అన్నారు. కనీసం ఆయన సొంత మండలంలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని సైతం పూర్తి చేయడం లేదని అన్నారు.