కాపర్ దొంగలు అరెస్ట్

కాపర్ దొంగలు అరెస్ట్

ముద్ర.పరకాల-పరకాల సబ్ డివిజన్ పరిధిలోని వివిధ సబ్ స్టేషన్లలో కాపర్ కాయిల్స్ ను దొంగిలించిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డిసిపి రవీందర్ తెలిపారు. మంగళవారం పరకాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నలుగురు వ్యక్తులు కలిసి గత కొద్ది సంవత్సరాలుగా కాపర్ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. వీరిలో కడమంచి రమేష్, కడమంచి అశోక్ ,పురాణం రమేష్, కడమంచి కళ్యాణ్ గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇంకొక వ్యక్తి పదహారులో ఉన్నట్టు ఆయనను కొద్ది రోజుల్లో పట్టుకుంటామన్నారు. పరకాల సబ్ స్టేషన్ లో కాపర్ కాయిల్స్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించాలని గత నెల 16న కాంట్రాక్టర్ మనసున్ రెడ్డి పరకాల సిఐ కి ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో మంగళవారం ఉదయం పరకాల సీఐ వెంకటరత్నం ఏఎస్ఐ వీరస్వామి, కానిస్టేబుల్ రమేష్, దేవేందర్, రాజ్ కుమార్, నాగరాజు, సల్మాన్, సుధాకర్లు ప్రత్యేక బృందంగా ఏర్పడి పట్టణంలో వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళుతున్న వారి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా కాపర్ కాయిన్స్ లో గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు తెలిపారు. కాపర్ దొంగలను పట్టుకున్న పరకాల సిఐ వెంకటరత్నం ఏఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ డీసీపీ రవీందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏసిపి కిషోర్, ఎస్సైలు పాల్గొన్నారు.