విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం
  • దశాబ్ది ఉత్సవాల్లో విద్యుత్ ప్రగతి చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటు
  • టిపిసిసి సభ్యుడు గండ్ర సత్యనారాయణ చిట్యాల

ముద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చిట్యాల మండలం లోని కొత్తపేట రెవెన్యూ శివారు రైతులతో కలసి వ్యవసాయ భూముల్లో విద్యుత్ స్తంభాలకు, వేలాడుతున్న వైర్లను టీపీసీసీ సభ్యుడు భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యుత్ ప్రగతి చేయడం ప్రభుత్వం నికి సిగ్గుచేటు అని అన్నారు. గ్రామాల్లో విద్యుత్ వైర్లు వేలాడుతున్న అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా కూడా అధికారులు ఎవరూ కూడా పట్టిచుకోవడంలేదని అన్నారు.

కొన్ని రోజుల క్రితం రేగొండ మండలంలో దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన బత్తిని కొమురయ్య వ్యవసాయ భూమిలో వేలాడుతున్న విద్యుత్ వైర్లకు తాకి రైతు చనిపోయిన కూడా అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసి మండలంలోని గ్రామాలలో వేలాడుతున్న వైర్లను మరమ్మతులు చేయించాలి అని అన్నారు.