పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదాలతో మళ్లీ  గెలుపొందుతా 

పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదాలతో మళ్లీ  గెలుపొందుతా 
  • ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్
  • పెద్దపల్లిలో నామినేషన్ వేసిన అనంతరం విలేకరులతో దాసరి మనోహర్ రెడ్డి  

ముద్ర ప్రతినిధి, పెద్దపెల్లి: పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదాలతో ముచ్చటగా ముడోసారి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందుతానని మూడోసారి కేసీఆర్ సీఎం అవుతాడని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దపెల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాసరి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు తో కలిసి నామినేషన్ వేశారు.  

నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అనంతరం మనోహర్ రెడ్డి. విలేకరులతో మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే  అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ని అధిక మెజార్టీతో  గెలిపించుకోవాలని,  ముఖ్యమంత్రి కేసీర్ మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు.  పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకుపేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్న కారు గుర్తుకు ఓటెయ్యలని, మీ కష్టాలు తీరుస్తామన్నారు. ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి పథకాలను ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదని, ఈ పథకాలన్నీ కూడా అమలు కావాలంటే, అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు సాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ఈ పథకాలన్నీ నియోజకవర్గ ప్రజలందరికీ చేరుతాయని, ఈ నెల  30 తేదిన జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో  గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దాసరి వెంట ఓదెల దేవస్థానం చైర్మన్ మేకల మల్లేష్ యాదవ్, రవీందర్ సింగ్,  ఎంపీపీ, జడ్పిటిసి, మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.