మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్ విందు

మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్ విందు

ముద్ర, వీణవంక: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని  ముస్లిం సోదరులకు వీణవంక గ్రామ సర్పంచ్ నీల కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఇప్తార్ విందు ను  ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎస్సై శేఖర్  రెడ్డి హాజరయ్యారు. మసీద్ లో  గురువారం  ఇప్తార్ విందును ఏర్పాటు చేసి  ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష ను విడిపించారు.ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్  భాను చందర్,ముస్లిం మత పెద్ద మహ్మద్ అమినోద్దీన్, నసీరోద్దీన్ మజార్,సాహెబ్ హుస్సేన్,యాసిన్,నవాజోద్దీన్,ఇసాక్,హాని,అసన్ లు ఉన్నారు.