ముస్లిం నూతన కమిటీని అభినందించిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు :తోట ఆగయ్య

ముస్లిం నూతన కమిటీని అభినందించిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు :తోట ఆగయ్య
  • సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి
  • తోట ఆగయ్య

ముద్ర,ఎల్లారెడ్డిపేట :ముస్లిం కమిటీ నూతనంగా ఎన్నుకోబడినందున శుక్రవారం రాత్రి మండల కమిటీ సమావేశం జరుగుతుండగా సమాచారం తెలుసుకున్న  జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య సమావేశానికి వెళ్లి నూతన కమిటీని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల సంఘం కార్యవర్గం ఐక్యతతో ఉంటూ కుల సంఘాలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. అదేవిధంగా సమాజసేవలో కూడా ముస్లిం మండల కమిటీ కార్యవర్గం ముందుండాలన్నారు. తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తోట ఆగయ్య హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో ముస్లిం మండల కమిటీ అధ్యక్షులు షేర్ షాదుల్లా, గౌరవ అధ్యక్షులు మహమ్మద్ చాంద్ పాషా, ప్రధాన కార్యదర్శి ధర్వేశ్, కోశాధికారి షేక్ గౌస్, మండల కో ఆప్షన్ మెంబర్ జబ్బర్, ఉపాధ్యక్షులు ఇమామ్, డాక్టర్ హైమద్, ఇర్ఫాన్, సాహెబ్,రజాక్, జర్నలిస్టు షరీఫ్, హైమద్, అజ్జు, షాదుల్ తదితరులు పాల్గొన్నారు.