రోగి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

రోగి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

10x6 సెం.మీ గల అరుదైన ప్యాంక్రియాటిక్ ట్యూమర్ (కణితి) శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

45 సంవత్సరాల మహిళ పొత్తికడుపు నొప్పితో బాధపడుతూ మెడికవర్ హాస్పిటల్స్ సర్జికల్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్ నారాయణ యర్రారపు గారిని సంప్రదించడం జరిగింది. రోగిని పరీక్షించిన డాక్టర్ ఆమెకి CT స్కాన్ చేయించుకోమని చెప్పడం జరిగింది. స్కానింగ్ లో ప్యాంక్రియాటిక్ ప్రాంతంలో సాలిడ్ సూడోపపిల్లరీ ఎపిథీలియల్ నియోప్లాజమ్ (SPEN) అనే అరుదైన ప్యాంక్రియాటిక్ ట్యూమర్‌(కణితి ) ఉన్నది అని నిర్దారించడం జరిగింది. కణితి యొక్క సంక్లిష్టత మరియు అరుదైన దృష్ట్యా విప్పల్స్ ప్రక్రియ (ప్యాంక్రియాటికోడ్యుడెనెక్టమీ) చేయాలని నిర్ణయించడం జరిగింది. డాక్టర్ శ్రీమన్ నారాయణ యర్రారపు గారి వైద్య నిపుణుల బృందం సుమారు 4 గంటలు శ్రమించి విజయవంతంగా కణితిని తొలగించడం జరిగింది. 

అనంతరం డాక్టర్ గారు మాట్లాడుతూ సాధారణంగా పదిమందిలో ఒక్కరికి కనిపించే ఈ యొక్క కణుతులు, సగటు వయస్సు 30-40 సంవత్సరాల వయస్సు గల యువతులలో ప్రధానంగా సంభవిస్తుంది. చాల మందికి అవి 3 నుంచి 4 సెం.మీ పరిమాణంలో మాత్రమే ఉంటాయి. కానీ ఈమెకు ప్యాంక్రియాస్ మరియు పోర్టల్ సిర యొక్క తలపై దట్టంగా 10x6 సెం.మీ కణితి గుర్తించడం జరిగింది. SPEN కణితులు తరచుగా ప్యాంక్రియాస్ యొక్క శరీరం మరియు తోకలో ఉత్పన్నమవుతాయి, కానీ ఈమెకు ప్యాంక్రియాస్ యొక్క తలపై ఉంది. ఈ కణితులకు కారణం చాలా వరకు తెలియదు కానీ ఇవి ప్యాంక్రియాస్‌లోని సూక్ష్మక్రిమి కణాల నుండి ఉద్భవించాయని భావించడం జరుగుతుంది అని అన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి 3 రోజుల్లోనే కోలుకున్నది మరియు 5 రోజుల్లో డిశ్చార్జ్ చేయడం జరిగింది. 

బేగంపేట సెంటర్ హెడ్ డాక్టర్ రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలు, పరికరాలు మరియు అనుభజ్ఞులైన డాక్టర్స్ వల్లనే ఇటువంటివి సాధ్యమవుతున్నాయి అని అన్నారు. డాక్టర్ శ్రీమన్ నారాయణ యర్రారపు గారిని వారి బృందాన్ని అభినందించారు.