ముద్ర వార్తకు స్పందన - వేపచెట్టు నుంచి విద్యుత్ దీపాని తొలగించిన గ్రామపంచాయతీ సిబ్బంది

ముద్ర వార్తకు స్పందన - వేపచెట్టు నుంచి విద్యుత్ దీపాని తొలగించిన గ్రామపంచాయతీ సిబ్బంది

ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీ సిబ్బంది వేప చెట్టు కొమ్మకు నిర్లక్ష్యంగా విద్యుత్ దీపాన్ని అమర్చడంతో ముద్ర దినపత్రికలో “విద్యుత్ స్తంభంగా వేపచెట్టు - గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం” అనే వార్త రావడంతో అధికారులు స్పందించి వేప చెట్టు కొమ్మకు అమర్చిన విద్యుత్ దీపాన్ని గ్రామపంచాయతీ సిబ్బందితో తొలగించారు. విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేయాల్సిన వీధి దీపాలను వేప చెట్టుకు ఏర్పాటు చేయడంతో గ్రామస్తుల నుంచి విమర్శలు వచ్చాయి.