వేసవిలో తాగు నీటి ఇబ్బంది లేకుండా చూడాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

వేసవిలో తాగు నీటి ఇబ్బంది లేకుండా చూడాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాబోయే వేసవిలో పట్టణ ప్రజలకు త్రాగునీటి కొరత రాకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మున్సిపల్  అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్  అడువాల జ్యోతితో  కలిసి పట్టణానికి ఫిల్టర్ బెడ్, ధర్మసముద్రం చెరువును  జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ  సందర్బంగా ఎమ్మెల్సీ  మాట్లాడుతూ రాబోయే వేసవిలో పట్టణ ప్రజలకు ఎలాంటి త్రాగునీటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ధర్మ సముద్రంలో నీటి లభ్యతను అంచనా వేసి త్రాగునీటి అవసరాలకు తగు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మెన్ గిరి నాగభూషణం, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్లెపెల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్, నాయకులు అడువాల లక్ష్మణ్, బొల్లె శేఖర్, మున్సిపల్ అదికారులు ఉన్నారు.