గ్లోబల్ గ్రీన్ గ్రోత్ విలేజ్ కోసం కృషి చేయాలి

గ్లోబల్ గ్రీన్ గ్రోత్ విలేజ్ కోసం కృషి చేయాలి

కోదాడ, ముద్ర:వ్యవసాయాదారిత భారత దేశంలో అగ్రీ టూరిజం  ద్వారా గ్లోబల్ గ్రీన్ గ్రోత్ విలేజ్ ఏర్పాటు సాధ్య అవుతుందని ఆర్ధిక సామాజిక విశ్లేషకులు బడుగుల సైదులు కోదాడ పట్టణంలో మంగళవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు.మే 16  ప్రపంచ వ్యవసాయ పర్యాటక దినోత్సవం సందర్భంగా గ్రామీణ వ్యవసాయ సాంస్కృతి పునరుద్ధరణ పై ఆయన పలు అంశాలను వెల్లడించారు.  గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ వనరులు ఉత్పత్తులు వివిధ కళలు చేతివృత్తులను సమ్మిళితం చేసి  వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ పర్యాటకుల సందర్శనవలన రైతులకుమరియు వివిధ చేతి వృత్తుల వారికి అదనపు ఆదాయం లభిస్తుంది.

విద్యాసంస్థలు, కార్పొరేట్ ఉద్యోగులు, పట్టణ ప్రాంత కుటుంబసభ్యులు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గటం, వినోదం, విజ్ఞానంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటు లభిస్తుందన్నారు. గ్రామీణ జీవన విధానం భారత వ్యవసాయ సంస్కృతి, పర్యావరణం, పునర్దించబడతాయన్నారు. అగ్రి టూరిజం ద్వారా స్థానికంగా ఉండే ఉత్పత్తులు వ్యాపారాలు సేవలు పుంజుకుంటాయి భిన్న మార్గాలలో ఉపాధి ఆదాయాలు పెరుగుతాయన్నారు. గ్రామీణ వ్యవసాయంలో నూతన ప్రయోగంగా అగ్రి టూరిజం రైతులకు సంవత్సరం అంతా ఆర్థిక మేలు కలుగజేస్తుందన్నారు. ఇప్పటికే మన దేశంలో మహారాష్ట్ర అగ్రి రూరల్ టూరిజం ద్వారా అభివృద్ధిని సాధిస్తున్నదనీ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు, బడ్జెట్ కేటాయింపుల ద్వారా రైతుల భాగస్వామ్యంతో అగ్రి టూరిజం భవిష్యత్తు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.