నారాయణ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్

నారాయణ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
  • 250 మంది విద్యార్థినులకు అస్వస్థత
  • హాస్టల్ నిర్వహకులపై చర్యలు
  • తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : నారాయణ జూనియర్ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్డు బ్రాంచ్ బాలికల క్యాంపస్ లో ఫుడ్ పాయింజన్ కారణంగా 250 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన 200 మంది విద్యార్థినిలను కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపించివేసింది.

సుమారు 2వేల మంది విద్యార్ధినిలు ఈ కాలేజీ క్యాంపస్ లో ఉన్నారు. కాలం చెల్లిన పదార్ధాలతో ఆహారాన్ని వండుతున్నారని, మంచినీరు కూడా శుభ్రంగా ఉండటం లేదని , ఆహార విషయంలో కానీ, వంటశాల శుభ్రత విషయంలో కనీస నాణ్యత పాటించడం లేదని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. మరోపక్క లక్షలాది రూపాయలను ఫీజుగా వసూలు చేసి తమ పిల్లల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీ , హాస్టల్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.