గిల్, రోహిత్ ​హాఫ్​సెంచరీలు

గిల్, రోహిత్ ​హాఫ్​సెంచరీలు

కొలంబో: ఈ మ్యాచ్‌లో, షాహీన్‌పై భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేసి మొదటి 3 ఓవర్ల స్పెల్‌లో మొత్తం 31 పరుగులు చేశారు. ఈ సమయంలో అఫ్రిది వేసిన రెండు, మూడో ఓవర్లలో గిల్ కూడా 3 ఫోర్లు బాదాడు. తొలి వికెట్‌కు గిల్‌-రోహిత్‌ల మధ్య 121 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం కనిపించింది. వర్షం పడి మ్యాచ్ ఆగిన సమయంలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్ స్టైల్ బ్యాటింగ్ కనిపించింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే షాహీన్‌ ఆఫ్రిది బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన రోహిత్‌.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు వన్డే క్రికెట్‌లో షాహీన్ అఫ్రిదిపై తొలి ఓవర్‌లోనే సిక్సర్ కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో తొలి ఓవర్ తొలి 5 బంతుల్లో రోహిత్ శర్మ పరుగులేమీ చేయలేదు. షాహీన్ ఆ ఓవర్‌లోని చివరి బంతిని రోహిత్ కాళ్ల వైపు వేయడానికి ప్రయత్నించాడు. హిట్‌మ్యాన్ దానిని లెగ్ సైడ్ వైపు తిప్పి బౌండరీ లైన్ వెలుపల సిక్సర్‌గా పంపించాడు. ఈ మ్యాచ్‌లో, షాహీన్‌పై భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేసి మొదటి 3 ఓవర్ల స్పెల్‌లో మొత్తం 31 పరుగులు చేశారు. ఈ సమయంలో అఫ్రిది వేసిన రెండు, మూడో ఓవర్లలో గిల్ కూడా 3 ఫోర్లు బాదాడు. తొలి వికెట్‌కు గిల్‌-రోహిత్‌ల మధ్య 121 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం కనిపించింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. వన్డే కెరీర్‌లో 240 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌కి ఇది 50వ అర్ధ సెంచరీ. వన్డేల్లో గిల్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ వికెట్‌కు నాలుగోసారి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వన్డేల్లో పాకిస్థాన్‌పై 18వ ఇన్నింగ్స్‌లో రోహిత్‌కి ఇది 7వ అర్ధ సెంచరీ. కాగా గిల్​52 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు ఉండడం విశేషం.