లద్నాపూర్ కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్  గ్రామ శాఖ అధ్యక్షునిగా గిరవేణ రాములు యాదవ్ 

లద్నాపూర్ కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్  గ్రామ శాఖ అధ్యక్షునిగా గిరవేణ రాములు యాదవ్ 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ లద్నాపూర్ గ్రామ శాఖ అధ్యక్షునిగా గిరవేణ రాములు యాదవ్ ను రామగిరి మండల అధ్యక్షులు బండారి సదానందం నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం చేశారు. తన నియమకానికి సహకరించిన ప్రతి ఒక్క మాజీ మంత్రి ఎమ్మెల్యే దుర్దల శ్రీధర్ బాబుకు ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు సదానందం కు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ట తిరుపతి యాదవ్ కు కాంగ్రెస్ నాయకులకు  కార్యకర్తలకు రాములు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు రోడ్డ బాబు, మండల కన్వీనర్  పేరం మహేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనం రామచంద్రరావు, బొల్లెపల్లి స్వామి గౌడ్,  యూత్ నాయకులు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, గొర్రె నరేష్ యాదవ్, విలేజ్ ప్రెసిడెంట్ తొగరి చంద్రయ్య, పులి రాజేశం, వీరగోని లక్ష్మణ్ గౌడ్, దుబాసి రంగయ్య, కాసిపేట ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.