నా భర్తకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించండి

పైళ్ల శేఖర్ రెడ్డి సతీమణి వనిత అభ్యర్థన
ముద్రప్రతినిధి, బీబీనగర్: భువనగిరి నియోజకవర్గంలో మిగిలిన అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయడానికి తన భర్త పైళ్ల శేఖర్ రెడ్డిని గెలిపించి శాసనసభ్యునిగా మరో అవకాశం ఇవ్వాలని ఆయన సతీమణి వనితా శేఖర్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆమె సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత పదేళ్లలో భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని ఆమె ఓటర్లకు వివరించారు. మరో సారి అవకాశం కల్పించి హ్యాట్రిక్ విజయాన్ని చేకూర్చాలని, మిగిలిపోయిన పనులను కూడా పూర్తి చేయడానికి వీలవుతుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎంతో ఆసక్తి కనపరుస్తూ, బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. ఆమెతో పాటు బీబీనగర్ జడ్పీటీసీ సభ్యురాలు గోలి ప్రణీత పింగళ్ రెడ్డి, ఇతర మహిళలు పాల్గొన్నారు.