పత్తిలో అధిక దిగుబడి రావాలి ... శాస్త్రవేత్త బి.రాంప్రసాద్

పత్తిలో అధిక దిగుబడి రావాలి ... శాస్త్రవేత్త బి.రాంప్రసాద్

స్టేషన్ ఘన్ పూర్: వ్యవసాయ శాఖ సలహాలు సూచనలు పాటించి ప్రతి రైతు పత్తిలో అధిక దిగుబడి సాధించాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త బి. రాంప్రసాద్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండలో శనివారం షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక క్రింద పత్తి సాగు, అధిక దిగుబడిపై వంద మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి సాగులో విత్తనాల ఎంపిక, సస్యరక్షణ పై వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు సూచనలు  పాటిస్తే అధిక దిగుబడును సాధించవచ్చు అన్నారు.

గ్రామ సర్పంచ్ నాగర బోయిన మణెమ్మ అధ్యక్షతన జరిగిన శిక్షణా కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వై.ప్రశాంత్, బి.మాధవి, డి.అశ్విని భువనగిరి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ దేశ్ పాండే, టీం మేనేజర్ వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కేశరాజు నరహరి, పసుల రమేష్, జోగు థామస్, జోగు కుమార్ లతోపాటు మీదికొండ, కొత్తపల్లి, చాగల్, పల్లగుట్ట, కృష్ణాజి గూడెం రైతులు పాల్గొన్నారు.