టర్కీలో విధ్యంసం

టర్కీలో విధ్యంసం

న్యూఢిల్లీ: టర్కీలో ప్రకృతి బీభత్సం సృష్టించింది.పెను భూకంపం టర్కీని కుదిపేసింది.ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సంభవించింది.టర్కీకి ప్రధాన పారిశ్రామిక కేంద్రమైన గజియాన్టెస్, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో పలు భవనాలు కుప్పకూలాయి.

24 గంటల్లో మూడు భూకంపాలతో టర్కీ వణికిపోయింది.భూకంపం కారణంగా టర్కీ,సిరియా దేశాల్లో 1800మందికి పైగా మృతి చెందారు.ఇంకా వేల మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన భూకంపం ధాటికి పరిసర ప్రాంతాలన్నీ చిగురుటాకులా వణికిపోయాయి.దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.