భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర 

భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర 

మార్చ్ నెల మొదటిరోజు వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు బ్యాడ్ న్యూస్ విన్పించాయి. అటు ఆయిల్ కంపెనీలు కాస్త ఉపశమనం కల్గిస్తున్నాయి. పెట్రోల్-డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గనుండగా, గ్యాస్ ధర మాత్రం అమాంతం పెరిగిపోయింది.  మార్చ్ 1 నుంచి కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ రెండింటి ధరలు పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. మరోవైపు పెట్రోల్, -డీజిల్ ధరల్ని స్వల్పంగా తగ్గించాయి. వాస్తవానికి గత 9 నెలల నుంచి  ఏవిధమైన పెరుగుదల లేదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ దాదాపు 90 డాలర్లు పలుకుతోంది. అయితే గ్యాస్ ధర భారీగా పెరగడంతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది.  గత కొద్దికాలంగా స్థిరంగా ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ఇప్పుడు పెరిగాయి. మార్చ్ 1 అంటే ఇవాల్టి నుంచి గ్యాస్ సిలెండర్ ధర ఏకంగా 30.50 రూపాయలు పెరిగిపోయింది. అయితే ఇది 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర ఒకేసారి 350 రూపాయలు పెరగడంతో 1769 రూపాయల్నించి 2119.50 రూపాయలకు చేరుకుంది సిలెండర్ ధర. ఇంతకుముందు జనవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 25 రూపాయలు పెరిగింది.