హుజూర్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్

హుజూర్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్

హుజూర్ నగర్ ముద్ర:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గురువారం నామినేషన్ వేశారు ముందుగా నియోజకవర్గంలోని ప్రాముఖ్యత చెందిన మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మేళ్లచెరువు స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయం గుర్రంపోడు తండా సంతు సేవాలాల్ గుడి లాంటి పలు ఆలయాలలో పూజలు జరిపిన అనంతరం సర్వమత ప్రార్థనలు చేసి మత పెద్దల ఆశీర్వాదాలను తీసుకున్నారు పట్టణంలోని అమరవీరుల స్తూపానికి జోహార్లు అర్పించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు  నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇందిరా సెంటర్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ కి ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారి జగదీశ్వర్ రెడ్డి కి నామినేషన్ పత్రాలను అందజేశారు అనంతరం పొట్టి శ్రీరాములు సెంటర్ నుండి ఇందిరా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ హుజూర్ నగర్ లో వార్ వన్ సైడేనని ఇది నామినేషన్ కార్యక్రమంలా లేదని విజయోత్సవ ర్యాలీల ఉంది అని రెండోసారి ఎమ్మెల్యేగా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు తన నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన పార్టీ శ్రేణులకు,కార్యకర్తలకు ,నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా నామినేషన్ సెంటర్ జనసంద్రంగా మారింది ఈ కార్యక్రమంలో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ,గట్టు శ్రీకాంత్ రెడ్డి,బానోతు రమణ నాయక్ ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు