ఎన్ని జన్మలు ఎత్తిన మీ ఋణం తీర్చుకోలేను

ఎన్ని జన్మలు ఎత్తిన మీ ఋణం తీర్చుకోలేను
  •  ఐదేళ్లలో కడియం మార్కు చూపిస్తా
  • లక్ష మెజార్టీతో సీఎంకు కానుక ఇద్దాం
  • టిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994 లో మొదటిసారిగా నియోజకవర్గం కు వచ్చినపుడు ఆశీర్వదించి, ఎమ్మెల్యే గా మంత్రి గా అవకాశం ఇచ్చారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఏనాడు దుర్వినియోగ  పరచలేదు నియోజకవర్గానికి చెడ్డపేరు తేలేదు.

నేను మీకు పెద్దన్నగా అండగా ఉంటా, రాజకీయంలో ఉన్నన్ని రోజులు నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేసే ఐదేళ్లలో కడియం మార్కును చూపిస్తా అన్నారు. నా 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు పదవులు అమ్ముకోలేదు. ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే ఇక్కడే ముక్కుకు నేలకి రాస్తా అన్నారు. ఎస్సీ నియోజకవర్గంలో పేదలు అధికంగా ఉన్నారు. వారి అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కెసిఆర్ ను విమర్శించే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కెసిఆర్ అమలు చేసే పథకాలు అమలు చేస్తున్నారా అని నిలదీయండి అన్నారు.

అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తాను అందులో మీ భాగస్వమ్యాన్ని, పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ రాజయ్య ల సహకారం తీసుకుంటాను అన్నారు. వల్ల రాజేశ్వర్ రెడ్డి చెప్పినట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగురుతుంది. 50 వేల తో కాదు లక్ష మెజారిటీ తెచ్చి సీఎంకు కానుకకు ఇద్దామన్నారు. పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి, గౌరవాన్ని పెంపోందిస్త అవినీతి కి తావులేని ఆదర్శవంతమైన నియోజకవర్గం గా తీర్చిదిద్దుతా అన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, చింతకుంట్ల నరేందర్ రెడ్డి, అన్నం బ్రహ్మారెడ్డి, బూర్ల శంకర్, బెల్దే వెంకన్న, సింగ పురం జగన్, నీలగట్టయ్య, రజాక్ యాదవ్, అశోక్ బాబు, మామిడాల లింగారెడ్డి ఏడు మండలాల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు లింగాల గణపురం మండలం నెల్లుట్ల నుండి నియోజకవర్గ కేంద్రానికి దాదాపు 25 వేల వాహనాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. 

రాజయ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీలు
భారీ ర్యాలీ, ప్రత్యేక సమావేశాన్ని నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరిలు ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వెళ్లి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేడు అని సమావేశంలో ఇద్దరు ప్రకటించారు.