“చెన్నూరు బరిలో ఉంటాను”

“చెన్నూరు బరిలో ఉంటాను”

రామకృష్ణాపూర్,ముద్ర: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా చెన్నూరు నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని టిపిసిసి డాక్టర్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ దాసరపు శ్రీనివాస్ తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు చైర్మన్ విశ్వతేజ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్స్ రాష్ట్ర వైస్ చైర్మన్ గా తనను నియమించినందుకు వారిరువురికి కృతజ్ఞతలు తెలిపారు.