యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం జరిగితే ఉపేక్షించేది లేదు

యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం జరిగితే ఉపేక్షించేది లేదు

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

థర్మల్ ప్లాంట్ ప్రాజెక్టులో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తం

ముద్ర ప్రతినిధి, నల్గొండ: యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులు హెచ్చరించారు. శనివారం నల్గొండ జిల్లా దామరచర్ల లో నిర్వహిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గత ప్రభుత్వంలో ఉన్న అలవాట్లను పద్ధతులను అధికారులు మార్చుకోవాలని హెచ్చరించారు.

జరుగుతున్న పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు పవర్ ప్రాజెక్ట్ జాప్యం కారణంగా రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడిందన్నారు. పవర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకే క్షేత్రస్థాయి పర్యటన జరుగుతుందని ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు యాదాద్రి పవర్ ప్రాజెక్టులో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కే విధంగా చూడాలన్నారు. ప్రపంచమంతా గ్రీన్ పవర్, రెనవవబుల్ ఎనర్జీ వైపు వెళ్తుంటే గత పాలకులు థర్మల్ పవర్ వైపు దృష్టి పెట్టారన్నారు. ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర,  ఎస్పీ చందన దీప్తి, పవర్ ప్రాజెక్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.