పర్యావరణం పట్ల ప్రజల్లో పెరిగిన అవగాహన

పర్యావరణం పట్ల ప్రజల్లో పెరిగిన అవగాహన
  • ఫారెస్ట్ నేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం
  • మొక్కలు నాటికి శరత్ నలమోతు

ముద్ర, తెలంగాణ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతోందని హైదరాబాద్ లోని కావూరిహిల్స్ రెసిడెన్షియల్ వెల్ ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శరత్ నలమోతు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ నేషన్ ఎకో ఫ్రైండ్లీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుధవారంనాడు కావూరి హిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శరత్ నలమోతు మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పురస్కరించుకుని మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టిన ఫారెస్ట్ నేషన్ సంస్థ ప్రతినిధుల బృందాన్ని ఆయన అభినందించారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని కోరారు.

మొక్కలు నాటడమే కాకుండా కొన్ని నెలల పాటు వాటి నిర్వహణ చేపట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పార్కుల్లో మొక్కలు నాటడంతో పాటు వాటి అభివృద్ధి పట్ల శ్రద్ధ, ఆసక్తి చూపించాలన్నారు. మొక్కలు, వృక్షాలు మానవ మనుగడకు ప్రకృతి ప్రసాదించిన వరాలని ఆయన అన్నారు. ఇండ్ల ఆవరణలలో పచ్చదం పెంపుకోసం జనాలు ఆసక్తి కనబర్చడం గమనిస్తున్నామని అన్నారు. రాను రాను మొక్కల పెంపకం పట్ల పౌరుల్లో ఆసక్తి పెరగడం శుభపరిణామని అన్నారు.

పర్యావరణ దినోత్సవాన్ని వారోత్సవంగా కూడా అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కావూరిహిల్స్ కాలనీకి చెందిన సీనియర్ సిటిజెన్స్  చిలకమణి కృష్ణ,  ఎం. రంగారావు, బి. ధనరాజ్, పి.ఎం. రెడ్డి, నియాజ్ పఠాన్, జి. సత్యనారాయణ రెడ్డి , గుజరాత్ కు చెందిన ప్రముఖ నటి ప్రాచి థక్కర్ తో పాటు ఫారెస్ట్ నేషన్ సంస్థ ప్రతినిధులు ఎన్. పూజా, వి. వివేక్ కుమార్, జి. హరిప్రసాద్ రాజు, చైతన్య, పవన్ కుమార్, సోహిల, మోహన్, హరిత తదితరులు పాల్గొన్నారు.