అనాధలకు అపర్ణ హస్తం అందించడం మనందరి బాధ్యత

అనాధలకు అపర్ణ హస్తం అందించడం మనందరి బాధ్యత

సామాజిక ఉద్యమ నాయకులు వెంకటేష్. నరసింహాల పిలుపు.....

యాదగిరిగుట్ట, ముద్ర : సమాజంలోని అనాధలకు. అంగవైకల్యం ఉన్నవారికి మనమంతా అండగా నిలిచి మనో ధైర్యాన్ని కల్పించాలని ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, ధరణికోట నరసింహలు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో గల అమ్మఒడి అనాధాశ్రమంలో వికలాంగుల పరిరక్షణ కమిటీ జిల్లా డైరెక్టర్ మచ్చ ఉపేందర్ గౌడ్ 42వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ తమ తమ జన్మదిన వేడుకలను, వివాహ వేడుకలను అనాధాశ్రమంలో. వృద్ధాశ్రమల్లో జరుపుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎన్నో జయ ప్రయోసాలకు ఓర్చి అనాధలకు ఆశ్రమం నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా వారు ఆశ్రమ నిర్వాహకులను అభినందించారు. ఈ జన్మ దిన వేడుకలలో ఆశ్రమ నిర్వాహకులు జేల్లా వెంకటేష్, నాయకులు జాగిల్లపురం అయిలయ్య, ఇంజ పద్మ, కాటపల్లి రజిత, బి ఉదయ్ కుమార్ తో పాటు ఆశ్రమంలోని యువకులు, వృద్ధులు పాల్గొన్నారు.