జూనియర్ రాష్ట్రస్థాయి రగ్బీ విజేతలు సూర్యాపేట, నల్గొండ జట్లు

జూనియర్ రాష్ట్రస్థాయి రగ్బీ విజేతలు సూర్యాపేట, నల్గొండ జట్లు

మఠంపల్లి ,ముద్ర: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని వి వి హెచ్ యస్ ఆవరణలో గురువారం జరిగిన జూనియర్స్ రాష్ట్ర  బాలికల రగ్బి విభాగం లో హోరాహోరిగా జరిగిన ఫైనల్ పోటీలో సూర్యాపేట, నల్గొండ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోటీలో నిర్ణీత సమయంలో నలగొండ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో హైదరాబాద్, వరంగల్ జడ్ల మధ్య జరగగా హైదరాబాద్ విజేతగా నిలిచింది.బాలుర విభాగంలో ఫైనల్ పోటీ నల్గొండ మేడ్చల్ మధ్య జరగగా నల్గొండ 12 -0 తో నల్గొండ విజేతగా నిలవగా మేడ్చల్ రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానం కోసం జరిగిన పోటీలో సూర్యాపేట, నిజా మాబాద్ మధ్య జరిగిన పోటీలో రెండు జట్లు నిర్ణీత సమయాల్లో సమఉజ్జిగా పోటీ పడగా రెండు జట్లు మూడో స్థానం  నిలిచాయి. టోర్నమెంట్లో 15 జిల్లాల నుండి 21 జట్లు పాల్గొనగా అందులో 15 బాలుర జట్లు, ఆరు బాలికల జట్లు పాల్గొ న్నాయి. వీరి నుండి అత్యంత ప్రతిభ కలిగిన 12 మంది బాలురను, 12 మంది బాలికలను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది.

ఎంపికైన వారిలో బాలికల విభాగంలో మహేశ్వరి, శ్రీవిద్య, రాజశ్రీ, శిరీష, అరుణ, దివ్య, అఖిల, సోనీ, చందన, స్పందన, లహరిక, చందన. బాలుర విభాగంలో మధు, సాయి, శ్రీకాంత్, అశోక్, వాసు, రాఘవేంద్ర, గోపాల్, అనిల్, ప్రణయ్, విగ్నేష్, గణేష్ ఎంపికైనారు. వీరు ఈనెల 4, 5, 6 తేదీలలో మహారాష్ట్రలోని పూణేలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తరుణ్ రెడ్డి, సెలక్షన్ కమిటీ చైర్మన్ గణేష్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా రగ్బి చైర్మన్ మన్నెం శ్రీనివాసరెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ అబ్జర్వర్ నోయల్ , టోర్నమెంట్ ఆర్గనైజర్ కర్నాటి తరుణ్ రెడ్డి,సెలక్షన్ కమిటీ చైర్మన్ కరణం గణేష్ రవి కుమార్, ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ తిరుపతయ్య, చౌదరి జిల్లా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మన్నెం సీతారామి రెడ్డి,టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పెండిపోలు రామచంద్రయ్య ,మాజీ సర్పంచ్ కొండేటి సుధాకర్ రెడ్డి ,రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు బాల్ రెడ్డి ,మట్టపల్లి దేవస్థాన ట్రస్టు సభ్యులు మన్నెం శశి రెడ్డి ,గ్రామ కో ఆప్షన్ సభ్యులు సురేష్ ,సీనియర్ క్రీడాకారులు గుర్రం రామ్ రెడ్డి ,దొంతి రెడ్డి నర్సిరెడ్డి ,హుజూర్ నగర్  మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింతల వెంకటేశ్వర్లు   వివిధ జిల్లాల రగ్బి అధ్యక్ష కార్యదర్శులు రెఫరీలు శ్రీకాంత్, మహేష్, రాజేష్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.