రాష్ట్రానికి కెసిఆర్ చీడలా దాపురించారు

రాష్ట్రానికి కెసిఆర్ చీడలా దాపురించారు

బీజేపీ మత విద్వేషాలు రెచ్చగోడుతు పబ్బం గడుపు కుంటుంది..
ఎమ్మెల్సి టి. జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : రాష్ట్రానికి కెసిఆర్ చీడలా దాపురించారని, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కెసిఆర్ అర్హత, నైతికత కోల్పోయాడని ఎమ్మెల్సి టి. జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని దేవిశ్రీ గార్డెన్స్ లో యూత్ జో డో.. బూత్ జోడో నినాదంతో బూత్ స్థాయి కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ విడుదల చేసిన మేనిఫెస్టో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు రోజుకు ఒక గంట సమయం కేటాయిస్తే..రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా  ఎగురవేయడం ఖాయమనీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన విద్యార్థులు, యువకుల బలి దానాలతో ఏర్పడిన తెలంగాణ లక్ష్యం నీరు గారిపోయిందని, 2022-23 లో బిశ్వా ల్ కమిటీ ప్రకారం 1,91,000 ఉద్యోగాలు ఉన్నాయని, 80 వేల ఉద్యోగాలు ప్రత్యక్షం భర్తీ చేస్తామనీ సంవత్సరం గడుస్తున్న ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని అన్నారు. టీ ఎస్ పీ ఎస్సీ ప్రశ్న పాత్రలు అంగట్లో అమ్మకానికి పెట్టారనీ, ఉద్యోగాల భర్తీనీ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ, నిరుద్యోగుల ఆశల పై నీళ్లుజల్లుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024 నుండి నిరుద్యోగుల యువతకు  ఆత్మస్థైర్యం కల్పించడానికి రు.4,000 భృతి ఇస్తామని 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మత విద్వేషాలను రెచ్చగోడుతు బీజేపీ పబ్బం గడుపుతొందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కాదు.సామాజిక వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు.

దళిత బంధు ఎవరు లబ్ది పొందుతున్నారో చర్చించాలని అన్నారు.  జనాభా ప్రాతిపదికన నిధులు వెచ్చించాలని సోనియా గాంధీ చట్టం రూపొందిచారని, సీఎం కెసిఆర్ జనాభా ప్రాతిపదికన కేటాయించిన ఎస్సీలకు రు.30 వేల కోట్లు, ఎస్టీ లకు రు.20 వేల కోట్లు  ఖర్చు చేయకుండా దళితులను మోసం చేస్తున్నారు. కెసిఆర్ ఏం ఐ ఎం, బీజేపీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వెనకాడరని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేన రెడ్డి. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు, ఏ ఐ సీ సీ సెక్రెటరీ సురభి,అర్పిత, శ్రీనివాస్, పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటి పర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, పిసిసి ఎన్ ఆర్ ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ చాంద్ పాషా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపెల్లి దుర్గయ్య, కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.