కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాలనీ సమస్యలను పరిష్కరిస్తాం : కీర్తిరెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాలనీ సమస్యలను పరిష్కరిస్తాం : కీర్తిరెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  లంద గుట్ట యాదవ సంఘం  కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థి కంభం అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె కీర్తి రెడ్డి అన్నారు. మంగళవారం కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  అక్కడి ప్రజలు వారు ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించాలని గతంలో నేటి ప్రజా ప్రతినిధులు మా సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి నేటి వరకు కూడా ఇక్కడ ముఖం చాటెసారని అన్నారు. డ్రైనేజీలు లేక, వర్షం కారణంగా  ఇళ్లలోకి నీరు వచ్చి నానా ఇబ్బందులు పడుచున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని, స్ట్రీట్ దీపాలు, డ్రైనేజీలు, గుట్ట నుండీ వచ్చు వర్షం నాలా ఏర్పాటుకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని అన్నారు.  భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గారేంటిలను అమలు పరుస్తుంది అని 1.మహాలక్ష్మి పధకం కింద ప్రతి అడపడుచుకు 2500/-లు,2.గ్యాస్ కేవలం 500/- లకే,3.RTC బస్ లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం,4.రైతుల 2.00 ల రుణ మాపి 5.ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల కింద 5.00 లక్షలు 6.వృద్దులు,వితంతువులకు 4000/- పింఛన్లు మొదలైన వాటిని అమలు పరుస్తారని వివరించారు. ప్రజలు ఆలోచించి మోసం మాటలు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి అందరూ కలిసి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో కడారి మల్లేష్ యాదవ్, రాసాల వీరేశం, కడారి ఐలయ్య, నక్కల ఆదినారాయణ యాదవ్, కడారి నరేష్, శంకర్ పాల్గొన్నారు.