బీఆర్ఎస్ తోనే ప్రజల జీవితాల్లో వెలుగులు

బీఆర్ఎస్ తోనే ప్రజల జీవితాల్లో వెలుగులు
  • ఓటేసిన ప్రతీసారి రెండు గంటలు కరెంటు కట్ చేసిన పాపం కాంగ్రెస్ ధి 
  • కాంగ్రెస్ కు వేసిన ఓటు రైతులను వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది
  • కాంగ్రెస్ నాయకులకు పదవులే అజెండా అయితే.. ప్రజా సంక్షేమమే బిఆర్ఎస్ అజెండా
  • 2014లో  బీఆర్ఎస్ కు వేసిన ఓటే ఇక్కడ భూములను సస్యశ్యామలం చేసింది
  •  భూగర్భ జలాలను పాతాళానికి పంపిన పాపం కాంగ్రెస్ ది అయితే... సాగు నీటిని పుష్కలం చేసిన ఘనత బిఆర్ఎస్ ది
  •  తెలంగాణలో ఇళ్లు లేని వారు ఉండకూడదనేదే భీఆర్ఎస్ లక్ష్యం
  • డాగు లు  వేయడానికి టైగర్ ని కాదు.. సేవకుడిని మాత్రమే
  • కారు గుర్తుతోనే అభివృద్ధి సాధ్యం
  • చివరి మనిషి వరకు దళిత బంధు అందిస్తాం
  • యువతకు ఉపాధి కల్పించడమే భవిష్యత్తు పాలన లక్ష్యం
  • పదేళ్ల పాలన సంతృప్తికరమైతే.. మరోసారి ఆశీర్వదించండి
  • ఊరూరా జనంతో మమేకం
  • పలుచోట్ల భారీగా చేరికలు


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఓటేసిన ప్రతీసారి రెండు గంటలు కరెంటు కట్ చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదని సూర్యాపేట భీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట లో ప్రచారంలో దూసుకెళ్తున్న జగదీష్ రెడ్డి నియోజకవర్గంలో సభలు సమావేశాలు రోడ్ షోలతో ప్రత్యర్థులకు  అందనంత ఎత్తుగా ముందంజలో ఉన్నారు. జనంతో మమేకమవుతూ సాగుతున్న జగదీష్ రెడ్డి ప్రచారంలో కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్ లో చేరుతున్నారు. సోమవారం ఆత్మకూరు ఎస్ , చివ్వెంల మండలాల్లో జరిగిన  ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళ హారతులు బైక్ ర్యాలీలతో అభివృద్ధి ప్రదాతకు ఎదురెళ్లి స్వాగతం పలికారు.  కోటి నాయక్ తండ, గాయం వారి గూడెం వాల్య తండా, వాటి ఖమ్మంపాడు గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ , ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేధి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు. ఇప్పటికే ఆరుసార్లకు పైగా ఓటు వేసిన గ్రామస్తులు ఎవరికి వేసిన ఓటుతో మంచి జరిగిందో ఆలోచించాలి అన్నారు.

కాంగ్రెస్ కు వేసిన ఓటు రైతులను వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేసింది అన్నారు.కాంగ్రెస్ నాయకులకు పదవులే అజెండా అయితే.. ప్రజా సంక్షేమమే బిఆర్ఎస్ అజెండా అన్నారు.2014లో  బీఆర్ఎస్ కు వేసిన ఓటే ఇక్కడ భూములకు  సస్యశ్యామలం చేసింది అన్నారు. ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న ఈ ప్రాంతానికి గోదావరి జిల్లాలు తీసుకొచింది భీఆర్ఎస్ కు వేసిన ఓటే అన్నారు.భూగర్భ జలాలను పాతాళానికి పంపిన పాపం కాంగ్రెస్ ది అయితే... సాగు నీటిని పుష్కలం చేసిన ఘనత బిఆర్ఎస్ ది అన్నారు. దేశం లో ఎక్కడా లేని రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు టిఆర్ఎస్కు వేసిన ఓటు ద్వారానే వచ్చాయని అన్నారు. 2014లో వేసిన ఓటు ఇంటింటికి మంచినీళ్లు కరెంటు తెచ్చింది అన్నారు.డాగు లు  వేయడానికి  నేను టైగర్ ని కాదన్న మంత్రి. ప్రజలకు అందుబాటులో ఉండే సేవకుడిని మాత్రమే అన్నారు.

కారు గుర్తుతోనే అభివృద్ధి సాధ్యం అన్న మంత్రి ,తెలంగాణలో ఇళ్లు లేని వారు ఉండకూడదనేదే భీఆర్ఎస్ లక్ష్యం అన్నారు. పదేళ్లలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది అన్న మంత్రి,యువతకు ఉపాధి కల్పించడమే భవిష్యత్తు పాలన లక్ష్యం అన్నారు. నియోజకవర్గ పిల్లలు గ్రామాలు తండాలోనే ఉండుకుంటూ సూర్యాపేటలో ఐటి ఉద్యోగం చేసుకునే విధంగా ఐటీ హబ్ ను మూడు నుండి నాలుగు వేల ఉద్యోగాలకు విస్తరిస్తామని తెలిపారు. 10 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం గా వి ఎకరాల్లో పారిశ్రామిక పార్క్ ను ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.పదేళ్ల పాలన సంతృప్తికరమైతే.. మరోసారి ఆశీర్వదించండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూడోసారి గెలిపిస్తే ప్రభుత్వపరంగా నిరుపేద మహిళలందరికీ సౌభాగ్య లక్ష్మి పథకం కింద మూడు వేల రూపాయలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, రైతు బీమా తరాలు ప్రతి పేదవారికి 5 లక్షల రూపాయలు వచ్చేలా కేసీఆర్ బీమా, పెన్షన్ 5000 , దివ్యాంగుల పెన్షన్ 6000, ఆరోగ్య బీమా 15 లక్షలకు పెంపు, రైతుబంధు 16 వేల రూపాయలు, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి పక్కా గృహ నిర్మాణం వంటి పథకాలను అమలు చేస్తామన్నారు. గత రెండు మ్యానీ ఫెస్టో లను నూటికి నూరు శాతం అమలు చేసిన ఒకే ఒక్క నాయకుడు దేశంలో కేసీఆర్ మాత్రమే అన్నారు.దళితుల జీవితాల్లో వెలుగులు రావాలనేదే కేసీఆర్ ఆకాంక్ష అన్న మంత్రి ఆర్థిక సమానత్లను రూపుమాపడానికి కెసిఆర్ తెచ్చిన దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు,చివరి మనిషి వరకు దళిత బంధు అందిస్తాం అన్నారు.