సూర్యాపేట జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎం సి పి ఐ యు పోటీ

సూర్యాపేట జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎం సి పి ఐ యు పోటీ
  • పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, జిల్లా ఇంచార్జ్ మట్టయ్య

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశం గురువారం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ ఏపూరి సోమన్న అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జి కామ్రేడ్ వస్కూల మట్టయ్య హాజరై మాట్లాడుతూ రేపు 30 తారీఖున జరుగు శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా నుండి నాలుగు నియోజకవర్గాలలో బి ఎల్ ఎఫ్ బలపరిచిన ఎం సి పి ఐ యు అభ్యర్థులను నిలబెట్టడం జరిగిందనీ,
కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ పుట్టిన ఈ గడ్డమీద ఎర్రజెండా ఎగరాలని సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎం సిపిఐ యు ను ఆదరించాలని, శ్రీరామ్ సాగర్ రెండవ దశ సాధించిన ఘనుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి  ఆశయ సాధన కోసం ఈ నాలుగు నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ మాట్లాడుతూ....

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఎందరో అమరవీరుల స్ఫూర్తితో ఈ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఏలుతున్న పాలకులు  నీరు అయిపోయాయని, నిధులు దొరజేబులోకి పోయాయని, నియామకాలు పేపర్ కి పరిమితం అయ్యాయని అన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విప్లమయ్యారని వారి ఆత్మహత్యలకుకారకులైరని అన్నారు.జరగబోయే ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపర్చిన ఎం సి పి ఐ యు  అభ్యర్థులను ఈ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో నిలబెట్టడం జరిగిందనీ ,తుంగతుర్తి నుండి కామ్రేడ్ వీర పాపయ్యను, వీరి నామినేషన్ కార్యక్రమం మూడవ తారీఖు నాడు ఉంటుందని, అట్లాగే కోదాడ నియోజకవర్గం నుండి ఎస్సీ సామాజిక వర్గమైన కామ్రేడ్ ఏపూరి సోమన్నను అభ్యర్థిగా నిలపడం  జరిగిందని ,వారి నామినేషన్ కార్యక్రమం 4వ తారీఖున ఉంటుందని, అట్లాగే హుజూర్నగర్ జనరల్ స్థానం నుండి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వస్కుల సైదమ్మను నిలపడం జరిగిందని, వారి నామినేషన్ కార్యక్రమం  ఆరో తారీకు నాడు ఉంటున్నదని, అట్లాగే సూర్యాపేట జనరల్ స్థానం నుండి బీసీ వర్గానికి చెందిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ వరికుప్పల వెంకన్న ని నిలబెట్టడం జరిగిందని, వారి  నామినేషన్ కార్యక్రమం 8వ తారీఖున ఉందని, ఈ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ మోరపాక ఉగ్రయ్య నలుగురి రమేష్ వేముల పెద్ద నరసయ్య అభ్యర్థులు వీర పాపయ్య వస్కుల సైదమ్మ వరికుప్పల వెంకన్న ఏపూరి సోమన్న మరియు నక్క శ్రీనివాస్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.