ఉప్పరి పేట అభివృద్ధికి కృషి... ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి

ఉప్పరి పేట అభివృద్ధికి కృషి... ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని అప్పర్పేట అభివృద్ధికి తనంత కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పరిపేట్ లో జీవన్ రెడ్డి పర్యటించి పలు కుల సంఘాల నాయకులను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉప్పరిపేట్ యాదవ సంఘం లో సంఘ పెద్ద మనుషులను కలిసి వారి వినతి మేరకు యాదవ సంఘ భవనం ముందు సీసీ రోడ్ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు నిధులు, నూతన హనుమాన్ దేవాలయం కొరకు 5 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.అలాగే ఉప్పరిపేట్ నుండి దగ్గులమ్మ గుడి వరకు మెటల్ రోడ్  నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్ పనులు పూర్తి చేస్తానని,చింత కుంట చెరువు మత్తడి నుండి గంజి నాలా వరకు శాశ్వత డ్రైనేజీ నిర్మణానికి అంచనాలు తయారు చేయాలని అధికారులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్బంగా కాలనీ ప్రజలు జీవన్ రెడ్డికి  కృతజ్ఞతలు తెలిపారు.