గ్రాండ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న జగిత్యాల క్రీడాకారులు

గ్రాండ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న జగిత్యాల క్రీడాకారులు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఇండో నేపాల్ ఛాంపియన్షిప్ లో జగిత్యాలకు చెందిన పవన్ కరాటే అకాడమీ విద్యార్థిని విద్యార్థులు విశేష ప్రతిభను కనబరిచి గ్రాండ్  ఛాంపియన్షిప్ ని కైవసం చేసుకున్నారు.బ్లాక్ బెల్ట్ విభాగంలో డి. జగన్,  స్పారింగ్ విభాగంలో ఎం. సంపత్ లు గోల్డ్ మెడల్ సాధించారు. పి. శ్రీజ అండర్ 14 బాలికల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి గ్రాండ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకొంది. కట భాగంలో డి. శివ, ఎం రామ్ చరణ్, ఎం హిమజ, పి. రుత్విక్ లు గోల్డ్ మెడల్, ఏం. మహోదయ,  ఏం. రక్షిత సిల్వర్ మెడల్ సాధించినట్లు కోచ్ ఆరుముల పవన్  తెలిపారు. వీరిని సీనియర్ మాస్టర్లు  రచ్చ శ్రీ బాబు,నేషనల్ ప్లేయర్ ప్రచ ఆకాష్  అభినందించినారు.