ఎంఎంటీఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి

ఎంఎంటీఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి

దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరిన మాజీ ఎంపీ బూర.....
ఆలేరు (ముద్ర న్యూస్): సికింద్రాబాద్ నుండి వంగపల్లి మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా యాదగిరిగుట్ట వరకు ఎం ఎం టి ఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతూ మంగళవారం నాడు సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైనును మంగళవారం నాడు భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు మరియు బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడుతూ గతంలో (2015) ఎం తాను ఎంపీగా ఉన్న సమయంలో యాదాద్రి దేవాలయం అభివృద్ధి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరియు భువనగిరి జిల్లా ప్రజల సౌలభ్యం కోసం భువనగిరి చుట్టూ మరియు యాదాద్రి చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి. ఎంఎంటీఎస్ లైనును యాదాద్రి స్టేషన్ వరకు పొడిగించడం జరిగిందని గుర్తు చేశారు. రాయగిరి రైల్వే స్టేషన్ పేరును కూడా యాదాద్రి స్టేషన్ గా మార్చడం జరిగిందని అన్నారు. 

దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో ఈ ప్రాజెక్టు మొత్తం పెండింగ్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బిజెపి పార్టీలో చేరడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ప్రోత్బలంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి. మెప్పించి మొత్తం ప్రాజెక్టు వేయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే లాగా కృషి చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేందర్ మోడీ చేతులమీదుగా వరంగల్లో పనులకు శంకుస్థాపన కూడా చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి త్వరితగతున ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. 

యాదాద్రి వంగపల్లి రైల్వే స్టేషన్లను శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాముఖ్యత తెలిపే విధంగా మోడల్ రైల్వే స్టేషన్లుగా తీర్చిదిద్దాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జనరల్ మేనేజర్ రైల్వే స్టేషన్లను పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సుదగాని హరిశంకర్ గౌడ్. పడాల శ్రీనివాస్. వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్. నాయకులు కూరెళ్ళ రాజు. సుధగాని ఉదయ్ కిరణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.