మహిళల సమాజానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.. ఎంపీపీ ధరావత్ కుమార్ బాబు నాయక్

మహిళల సమాజానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.. ఎంపీపీ ధరావత్ కుమార్ బాబు నాయక్
  • సంక్షేమ పథకాలను మహిళల పేరు నామకరణం చేయడం, బిఆర్ఎస్ ప్రభుత్వానికి సాధ్యం
ముద్ర, చివ్వెంల:-మహిళ సమాజానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని.. చివ్వెంల ఎంపీపీ  ధారావత్ కుమారి బాబు నాయక్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పాచ్చని తండాలో టిఆర్ఎస్ మేనిఫెస్టో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలను మహిళల పేరు నామకరణం చేయడం ముఖ్యమంత్రి కెసిఆర్ కు మహిళల పట్ల ఉన్న ప్రేమ అభిమానాన్ని మహిళా ఓటర్లు గుర్తు చేసుకోవాలన్నారు. మహిళా సమైక్య భవనాలు వంటి పథకాలు మహిళ లోకానికి వరమని తెలిపారు. ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి బిఆర్ఎస్ మేనిఫెస్టో వివరించడం జరిగిందన్నారు. సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ని 50 వేల మెజార్టీ గెలిపించాలని మహిళలందరికీ విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజులలో మన బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. మండలంలోని మొగ్గయ్యగూడెం, మున్యా నాయక్ తండ, బాధ్యతండ, తిరుమలగిరి, గుంజలూరు, పలు గ్రామాల్లో బిఆర్ఎస్ మేనిఫెస్టో ప్రచారం ఘనంగా నిర్వహించినారు. కార్యక్రమంలో జెడ్పిటిసి భూక్య సంజీవ నాయక్, సర్పంచ్ లు రవి, భూక్య రాజ్యలక్ష్మి నాగు నాయక్, క్రాంతి, కంచర్ల నిర్మల గోవిందరెడ్డి, బైరు రవీందర్, బికారి, సుశీల సాగర్, సైదా, సురేష్, రామచంద్ర, లచ్చిరాం, గ్రామాల సర్పంచులు గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.