కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలి : ఆటో యూనియన్

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలి : ఆటో యూనియన్
  • 500 ఆటోలతో నిరసన రాస్తారోకు ధర్నా
  •  ముద్ర ప్రతినిధి ఎల్లారెడ్డిపేట

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోకి వచ్చాక గృహలక్ష్మి పేరుతో పథకాన్ని అమలు చేసి మా బతుకులు నాశనం అయ్యాయని ఎల్లారెడ్డిపేట మండలం ఆటో యూనియన్ అసోసియేషన్ వారు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం ఆటో యూనియన్ 500 మంది ఆటలతో గొల్లపల్లి నుంచి ఎల్లారెడ్డిపేట కు చేరుకొని పాత బస్టాండ్ లో సుమారు గంటపాటు ధర్నా రాస్తారోకోని నిర్వహించారు. అనంతరం ఆటోలో ర్యాలీగా వెళ్లి  అంబేద్కర్ కు స్థానిక తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తే మా బతుకులు బాగుపడతాయని ఓటు వేసి గెలిపిస్తే కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలులోకి తేవడంతో ఆటో నడుపుకొని బ్రతికే కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలను నడుపుతే 200 రూపాయలు మిగులుతాయని అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో ప్రతి ఒక్క ఆటో యాజమాని ఆటోలను నడుపుకొని బతికేవారు. ఇందులో ప్రతి ఒక్కరు అప్పు సప్పు చేసి ఆటోలు కొనుగోలు చేశామని ఆటోలలో ఎవరు ప్రయాణం చేయకపోవడంతో మా అప్పులు తీరేది ఎలా మా కుటుంబాలు బ్రతికేది ఎలా అని ప్రశ్నించారు. నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి మా పొట్టను కొట్టాడని అని అన్నారు.ఈ మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో మండల ఆటో యూనియన్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.