శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత

శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత

చిగురుమామిడి ఎస్ఐ సామల రాజేష్
చిగురుమామిడి ముద్ర న్యూస్:శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఎస్ఐ సామల రాజేష్ పేర్కొన్నారు.మండలంలోని ఇందుర్తి గ్రామంలో  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  బుధవారం రోజున వాహన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని వారికి వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.మద్యం త్రాగి వాహనాలు నడపవద్దన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే శిక్ష తప్పదని, త్రిబుల్ రైడ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. అలాగే వాట్సప్ గ్రూపులలో ఇతరులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా పోస్టులు చేస్తే వారిపై, గ్రూప్ అడ్మిన్ పై కేసులో నమోదు చేస్తామన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను, నిర్వహణ భాద్యత గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తోట సతీష్, మాజీ జడ్పీటీసీ అందే స్వామి, వార్డు సభ్యులు చేల్పురి విష్ణమా చారి,  ఎస్ కే సిరాజ్, సుదగొని శ్రీనివాస్, ట్రాక్టర్ డ్రైవర్ల, ట్రాక్టర్ యజమానులు,  యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.