స్టాప్ బాల్ క్రీడకు ఎంపికైన మనూషా....

స్టాప్ బాల్ క్రీడకు ఎంపికైన మనూషా....

తుర్కపల్లి (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని బండారు మనూషా ఎస్ జి ఎఫ్ జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బాలమని. గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు. ఎంపీటీసీ సభ్యులు పలుగుల నవీన్ కుమార్. విద్యా కమిటీ చైర్మన్ బొల్లారం రేఖ లు చెప్పారు.

డిసెంబర్లో అదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జరిగిన అంతర్ జిల్లా స్టాఫ్ బాల్ క్రీడలో మంచి నైపుణ్యం కనబరిచినందుకు మనుష జాతీయ స్థాయికి ఎంపిక అయిందని వారు చెప్పారు. జనవరి 10 నుండి 15 వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని బిక్నూర్లో జరిగే జాతీయస్థాయి క్రీడా పోటీలలో మనూష పాల్గొన్నారు తెలిపారు. కాగా మానుష ఎంపిక పట్ల పాఠశాల అధ్యాపక బృందం. పిఈటి వీరేశం తో పాటు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.