కేంద్ర పథకాలను వినియోగించుకోండి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు

కేంద్ర పథకాలను వినియోగించుకోండి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: నిరుపేదల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను అందరూ వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పి.వి.శ్యామ్ సుందర్ రావు కోరారు. బీబీనగర్ పట్టణ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిచింన వికసిత్ భారత్ సంకల్ప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అధికారులను లేదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఆయనతో పాటు పలువురు  ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిదులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.