రాజీనామాకు సిద్ధపడ్డ మేడ్చల్ జెడ్పీ వైస్ చైర్మన్  వెంకటేష్...

రాజీనామాకు సిద్ధపడ్డ మేడ్చల్ జెడ్పీ వైస్ చైర్మన్  వెంకటేష్...

కేటీఆర్ సూచనతో వెనక్కి...

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేష్ గురువారం రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డాడు. అయితే చివరి నిమిషం లో కేటీఆర్ నుంచి ఆయనకు ఫోన్ రావటంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేయడాన్ని నిరసిస్తూ వెంకటేశ్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించాలని కూడా వెళ్లాడు. అంత లోనే ఈ వార్త బీ ఆర్ ఎస్ అధిష్టానానికి చేరడంతో వెంటనే కేటీఆర్ వెంకటేశ్ కు ఫోన్ చేసి సర్ది చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన రాజీనామా నిర్ణయాన్ని తాత్కాలికంగా  విరమించుకున్నట్లు తెలిసింది. ఈ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి తో సన్నిహితంగా ఉండే జిల్లావైస్ చైర్మన్ బెస్త వెంకటేష్ ఉన్నట్టుండి ఒక్కసారి గా రాజీనామా నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో పార్టీ శ్రేణులకు ఇంకా అంతు పట్టడం లేదు.