విద్య, వైద్యంపై ప్రభుత్వం భరోసా కల్పించాలి

విద్య, వైద్యంపై ప్రభుత్వం భరోసా కల్పించాలి
  • ప్రజాపాలనతో ఇందిరమ్మ రాజ్యం
  • మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, అందరికీ అందుబాటులో వైద్యం అందించేలా ప్రభుత్వం భరోసా కల్పించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మౌలిక వసతులు పెరిగిన నియామకాలు జరగలేదన్నారు ఫలితంగా ప్రమాణాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2021 లో బిశ్వాస్ నివేదిక ప్రకారం 1.94 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. నిధులు నీళ్లు నియామకాల కోసం ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగ నియామకాలు జరగలేదన్నారు శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన  ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రి దామోదర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ...వ్యవస్థ అనేది శాశ్వతంగా ఉండాలన్నారు. వ్యవస్థను ఎంత పటిష్ట పరిస్తే సమాజం అంత ముందుకుపోతుందన్నారు. నాయకుడంటే రాబోయే తారలు గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాంకానీ గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసిందన్నారు. నేను విద్యా శాఖ మంత్రిగా ఉన్న కాలంలో మోడల్ స్కూల్స్, కెజిబివిలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు విద్యా, వైద్యం విషయంలో ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. ఆరు గ్యారెంటీలు ఆచరణలోకి తీసుకోస్తామన్నారు. రూ 10 లక్షలతో ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు అమలు చేస్తామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉందని, ఇచ్చిన గ్యారెంటిలను రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తామని ప్రకటించారు.

6 లక్షల కోట్ల అప్పులు

గత తొమ్మిదిన్నరేళ్ళ కాలంలో 6 లక్షల కోట్ల అప్పులు చేశారని మంత్రి దామోదర్ పేర్కొన్నారు. అంతకుముందు మెదక్ మున్సిపల్ చైర్మన్ (బిఆర్ఎస్) మాట్లాడుతూ... పట్టణాభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరగా మంత్రి స్పందిస్తూ అప్పులు, మిత్తులు, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పోయారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రామంలో ఇల్లు దిక్కులేదు..జాగా దిక్కులేదన్నారు. ఇప్పటికే రెండు పథకాలు అమలు చేశాం మిగతా నాలుగు కూడా అమలు చేస్తామన్నారు.

ప్రజల ముందుకే ప్రభుత్వం

ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాం తెస్తామని మంత్రి దామోదర్ అన్నారు. గ్రామ అవసరాలు, ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.మెదక్ ఆసుపత్రిలో సిటి స్కాన్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. చార్మినార్ జోన్ విషయంలో స్పందించిన మంత్రి రాజన్న జోన్ లో కలపడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.  సభకు అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ... ఇచ్చిన మాట ప్రకారం పనిచేస్తామన్నారు. మెదక్ అభివృద్ధికి మంత్రి సహకరించాలని కోరారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభలు జరిగాయన్నారు. డాటా ఎంట్రీ కూడా మొదలైందన్నారు. ర్ సభలో అడిషనల్ కలెక్టర్ రమేష్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, డీఎంహెచ్ఓ చందు నాయక్, డా. చంద్రశేఖర్, నాయకులు రాజిరెడ్డి, సుప్రభాత్ రావు, ఆంజనేయులు గౌడ్, జీవన్ రావు, హరిత, సులోచన, శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.