ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంఛార్జి మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే.....

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంఛార్జి మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే.....

ఆలేరు (ముద్ర న్యూస్):ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంఛార్జి మంత్రిగా నియమితులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శనివారం నాడు ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుకుల నగేష్ హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.