కుర్మగుడెం నుండి మన్నె వారి పంపు కు వెళ్ళే రోడ్డు తక్షణమే బీటీ రోడ్డుగా వెయ్యాలి - దయ్యాల నరసింహ

కుర్మగుడెం నుండి మన్నె వారి పంపు కు వెళ్ళే రోడ్డు తక్షణమే బీటీ రోడ్డుగా వెయ్యాలి -  దయ్యాల నరసింహ

భువనగిరి జూలై 27 (ముద్ర న్యూస్): భువనగిరి మండలం హన్మపురం మదిరి కుర్మగుడేం గ్రామం నుండి మన్నేవారి పంపు పోయే రోడ్డు బీటీ రోడ్డుగా వేయాలని సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని కోరారు, ఆయన మాట్లాడుతూ గత 22 సంవత్సరాల క్రితం మెటల్ రోడ్డు వేశారు కొంతకాలం తర్వాత ఆ రోడ్డు గుంతల మయం అయింది చాలా కాలం నుండి అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి గ్రామపంచాయతీకి దృష్టికి తీసుకపోవడం జరిగింది. కావున ఆ రోడ్డు వర్షాలకు గుంతలుగా ఏర్పడడంతో   రైతులకు, నాలుగు గ్రామాల ప్రజలకు, ఆటోలు, స్కూల్ బస్సులు  రాకపోకలు ఇబ్బందికరంగా మారింది కావున ఇప్పటికైనా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి  స్పందించి రోడ్డును వెంటనే బీటీ రోడ్డుగా మార్చి పనులు చేపట్టాలని ప్రజల తరఫున రైతుల తరఫున దయ్యాల నర్సింహ  కోరారు. 

ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, రైతులు గదిరెడ్డి గోపాలరెడ్డి, పన్నల రాజిరెడ్డి, లింగారెడ్డి, ప్రతాపరెడ్డి, తోటకురి చంద్రయ్య, వంగేటి పోచిరెడ్డి, తోటకురీ గణేష్, అశోక్, ముద్ధం యాదయ్య, తుమ్మేటి కొండల్, జాన చంద్రయ్య, మోటి కృష్ణ, కుసుమ రాములు, బల్ద మల్లయ్య, మోటే బిక్షపతి, మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.