ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపికైన ఖాజాపూర్ తండా విద్యార్థి ధరావత్ కార్తిక

ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపికైన ఖాజాపూర్ తండా విద్యార్థి ధరావత్ కార్తిక

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ తండా విద్యార్థిని ధరావత్ కార్తిక  అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైంది. అండర్ 15 విభాగంలో సాఫ్ట్ బాల్ ఆసియా కప్ క్రీడా పోటీలకు ఇండియా టీంకు తెలంగాణ నుంచి ఎంపికైంది. తూప్రాన్ లోని టీఎస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి 9వ తరగతి చదువుతుంది. చైనాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయని, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాల్సిందిగా విద్యార్ధి తండ్రి భాస్కర్ విజ్ఞప్తి చేశారు.