పెద్దపల్లి లో బీఆర్ఎస్ లో చేరిన మైనారిటీ యువకులు

పెద్దపల్లి లో బీఆర్ఎస్ లో చేరిన మైనారిటీ యువకులు
  • కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్దపల్లి పట్టణానికి చెందిన మైనారిటీ యువకులు మంగళవారం గూలాబీ గూటిలో చేరారు. వారికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండోలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు జహీర్, ముజీబ్, బిలాల్, ఘయాజ్ ఖాద్రి,పైజాన్, షానవాజ్, రాయన్, సుఫియాన్, అఖిల్, ఫైజల్, నాభీల్, నేహాల్, జూనైద్ లు మాట్లాడుతూ ఎన్నికల్లో మూడోసారి ముచ్చటగా మైనారిటీలందరం మనోహర్ రెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో పెద్దపల్లి లోని  మైనారిటీలకు ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, ఇంక రాబోయే ప్రభుత్వంలో మైనారిటీలకు మరింత పెద్దపీట వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.