ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి.

ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి.
  • ఎన్నికల నేపథ్యంలో పలు విభాగాలను తనిఖీ.
  • కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పట్టుబడిన నగదు, వస్తువులు  ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పర్చడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు. మంగళ వారం కలెక్టరేట్ లోని ట్రెజరీ స్టాంగ్ రూమ్, ఎన్నికల విభాగం అలాగే మీడియా సెంటర్ లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి తప్పక పాటిస్తూ నియమించిన బృందాలు fst, sst, పోలీస్ బృందాలు నిరంతరం తనిఖీలు చేపట్టి  నగదు, బంగారం, వెండి వస్తువులను ట్రెజరీ  స్ట్రాంగ్ రూమ్ లో జమ చేయడం జరుగుతుందని అలాగే స్ట్రాంగ్ రూం కు పటిష్ట బందోబస్తు  ఏర్పాటు చేయనైనదని తెలిపారు. జిల్లా స్థాయిలో గ్రీవెన్సు కమిటీ సదరు భాద్యుల ఆధారాలను పరిశీలన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మీడియా సెంటర్ ద్వారా వీలైనంత ఎన్నికల సమాచారం  మీడియాకు అందించాలని అలాగే   కమిటీ  సభ్యులు విడతల వారీగా విధులు నిర్వహించాలని సూచించారు. తదుపరి ఎన్నికల విభాగం ను తనిఖీ చేసి రికార్డ్స్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏటిఓ ఆనిల్ కుమార్, dpro రమేష్ కుమార్,  ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, dlo లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.