నీటి సమస్య తీర్చడంలో పాలకులు విఫలం

నీటి సమస్య తీర్చడంలో పాలకులు విఫలం

మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : తాగునీటి ఎద్దడిని నివారించడంలో  పాలకులు విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. ఆదివారం కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ ట్యాంకులతో నీటి సరఫరా ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు ప్రజలకు వేసవిలో నీటి సమస్యను తీర్చలేకపోతున్నారని విమర్శించారు. గత ఆరు సంవత్సరాలుగా ట్రస్ట్ ద్వారా వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. మంచిర్యాల ,నస్పూర్ పురపాలక సంఘాల పరిధిలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజు తాగునీటి సరఫరా చేస్తామని తెలిపారు. పురపాలక శాఖ పాలకులు, అధికారులు వేసవిలో నీటి సమస్య లేకుండా చూడవలసిన బాధ్యత ఉందని అన్నారు. నీటి సమస్య తీరే వరకు ప్రజలకు ప్రతి వేసవిలో ట్యాంకర్ ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు.