మతపరమైన నిర్మాణాలకు మునిసిపల్ నిధులా?

మతపరమైన నిర్మాణాలకు మునిసిపల్ నిధులా?

బిజెపి ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వృత్తి విద్య నైపుణ్య శిక్షణ కోసం కేటాయించిన 12 ఎకరాల అటవి భూమిని అక్రమంగా ఒక వర్గానికి ఈద్గా నిర్మాణానికి కేటాయించడం,ఆ ఈద్గా నిర్మాణానికి రూ.1.30 కోట్లు మున్సిపల్ నిధుల  కేటాయింపు ముమ్మాటికి అధికార దుర్వినియోగమే నని బిజెపి నేతలు ఆరోపించారు. పట్టణ అభివృద్దికి వెచ్చించాల్సిన డబ్బులను ఇలా మత పరమైన  కార్యక్రమాలకు వినియోగించడం అధికార దుర్వినియోగమేనని వారు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం మునిసిపాలిటీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల హోమ్ మంత్రి ప్రారంభించిన ఈదాకు మున్సిపల్ నిధుల కేటాయింపు మున్సిపాలిటీకి సక్రమంగా పన్ను చెల్లింపు దారులను  అవమానించడమే నన్నారు.

మున్సిపల్ పరిధిలో లేని చించోలి ఎక్స్ రోడ్ వద్ద గల రిజర్వ్ ఫారెస్ట్ లో ఈద్గా నిర్మాణానికి ఉపయోగించడం అధికార దుర్వినియోగమేనని వారు ధ్వజమెత్తారు.  అనంతరం మున్సిపల్ కమీషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రాం నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసిమ్మె రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ నాయుడు మురళి జిల్లా ఉపాధ్యక్షులు కమల్నయన్, జిల్లా కార్యదర్శి మిట్టపల్లి రాజేందర్,  శ్రావణ్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అమరవేణి నర్సాగౌడ్, బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్  తదితరులు పాల్గొన్నారు.