కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం

కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం
  • యంగ్ లీడర్ సంస్థ ఫౌండర్ మురళీ కృష్ణ గౌడ్

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వికారాబాద్ జిల్లా తాండూరు లోయంగ్ లీడర్ సంస్థ ఫౌండర్ మురళీ కృష్ణ గౌడ్ తెలిపారు. గురు వారం తాండూర్ లో మీడియా తో మాట్లాడుతూ  బీజేపీ నాకు పార్టీలో పూర్తి స్తాయిలో గౌరవం, అవకాశం కల్పించిందనీ అన్నారు. బీజేపి లో 13 వేల మంది కార్యకర్తలను చేర్పించానని అన్నారు. బీజేపి అగ్ర నాయకులను ఎమ్మెల్యే ల కొనుగోలు అంశం పై తాండూర్ బీ ఆర్ ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అకారణంగా దుర్భాషలాడారని, అయినా రోహిత్ రెడ్డి పై బిజెపి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనను బాదిన్చిందన్నారు. తాండూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఆహ్వనించడం, ఆయన తో తనకు సన్నిహిత సంబంధం ఉన్నందువల్ల కాంగ్రెస్ పార్టీ లో కార్య కర్తగా క్రియాశీలకంగా పనిచేస్తానని తెలిపారు. ఇందు కోసం ముందుగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోనున్నట్లు మురళీ కృష్ణ గౌడ్ తెలిపారు. బీజేపీ అధిష్టానం తాండూరు నుండీ పోటీ చేయాలని వత్తిడి తెచ్చి నా అంగీకరంచక లేదన్నారు.