భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు  అలర్ట్ గా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు  అలర్ట్ గా ఉండాలి

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
వర్షం పరిస్థితులను సమీక్షించిన మంత్రి కేటీఆర్..
జిల్లా యంత్రంగానికి  మంత్రి కేటీఆర్ ఆదేశాలు

 ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటూ అలర్ట్ గా ఉండాలని మంత్రి కేటీఆర్ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ అనురాగ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తో ఫోన్ లో అధిక వర్షాలు, వరదల  పరిస్థితులపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.  

సిరిసిల్ల పట్టణం పైన ఉన్న చిన్న బోనాల చెరువు తెగడం వలన పట్టణంలోని ప్రభావిత వర్షాభావ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమయితే సహాయక చర్యలకు యంత్రాలను హైద్రాబాద్ నుంచి పంపిస్తామని తెలిపారు.అలాగే ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలోనే ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.