శానిటరీ ప్యాడ్స్ వినియోగ రహిత సిద్ధిపేట మన లక్ష్యము

శానిటరీ ప్యాడ్స్ వినియోగ రహిత సిద్ధిపేట మన లక్ష్యము

రాష్ట్రంలోనే తొలి రుతుప్రేమ మెన్స్ట్రువల్ కప్పులు, క్లాత్ ప్యాడ్ ఔట్ లెట్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
 ముద్ర  ప్రతినిధి: సిద్ధిపేట: శానిటరీ ప్యాడ్స్ వినియోగ రహిత సిద్ధిపేట మన లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బస్టాండులో గురువారం సాయంత్రం జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, పోలీసు కమిషనర్ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, డీపీఓ దేవకి, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సులతో కలిసి రాష్ట్రంలోనే తొలి రుతుప్రేమ మెన్స్ట్రువల్ కప్పులు, క్లాత్ ప్యాడ్ ఔట్ లెట్ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి రుతుప్రేమ మెన్స్ట్రువల్ కప్పుల ద్వారా నెలసరి సౌకర్యం,ఆరోగ్యం ఉంటుందని అవగాహన కల్పించాలని కోరారు. ఆశాకార్యకర్తలు, ఏఏన్ఏం, అంగన్ వాడీ, ఆర్పీలు సమన్వయంతో ముందుగా పట్టణంలోని 5 మున్సిపల్ వార్డులను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని పూర్తయ్యేలా చొరవ చూపాలని ఆదేశించారు.ఈ మేరకు రుతుప్రేమ ఫోటో గ్యాలరీని తిలకించారు.