ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతా శిశు కేంద్రన్ని ఎమ్మెల్యే  పరిశీలించారు. అనంతరం 500 కోట్ల తో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించి ఆసుపత్రిలో రోగులు బాలింతలతో మాట్లాడుతూ ఆసుపత్రిలో  సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ను  అడగగానే మెడికల్ కాలేజ్ ని మంజూరు చేశారని,  500 కోట్లతో మెడికల్ కాలేజీ. నిర్మించుకుంటున్నామని, మెడికల్ కాలేజీ వల్ల పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయన్నారు.  

 ఒకప్పుడు ఎక్స్రే రే కూడా సరిగా లేక పోయేదని కానీ ఇప్పుడు రెండు కోట్లతో సిటీ స్కాన్  ఏర్పాటు చేసుకున్నామన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో నరాల వైద్యులు అందుబాటులో ఉన్నారని,                                 ఒకప్పుడు 15 మంది వైద్యులు ఉంటే నేడు 150 మంది వైద్యులతో పేదలకు వైద్యం చేస్తున్నారు.                      కిడ్నీ బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం  ఏర్పాటు చేశాం అన్నారు.